పెద్దపల్లి : ప్రభుత్వం తక్షణమే కన్నెపల్లి పంపింగ్ స్టేషన్ల నుంచి నీటిని ఎత్తిపోసే చర్యలు చేపట్టి, తద్వారా పంటలు.. రైతుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజకీయాలను పక్కన పెట్టి రైతులను ఆదుకోవాలన్నారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు. లేదంటే రైతుల తరఫున పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.