ధర్మారం, నవంబర్ 11: పెద్దపల్లి జిల్లా (Peddapalli) ధర్మారం మండలం పెర్కపల్లి గ్రామంలో విషాహారం తిని గొర్రెలు మరణించగా బీఆర్ఎస్ మండల నాయకులు గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. గత రెండు రోజుల నుంచి ఇప్పటికే 36 గొర్రెలు మృతిచెందగా, తాజాగా శనివారం మరో ఆరు గొర్రెలు మరణించగా మూగజీవాల మరణం సంఖ్య 42 కు చేరింది. దీంతో సమాచారం తెలుసుకున్న పార్టీ నాయకులు గొర్రెల మంద వద్దకు వెళ్లి బాధిత గొర్రెల పెంపకం దారులను పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని ఈ సందర్భంగా వారు భరోసా ఇచ్చారు. అనంతరం ఫోన్ లో రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బాధిత గొర్రెల పెంపకం దారులతో మాట్లాడారు. విషాహారం తిని గొర్రెలు మరణించడం బాధాకరమని ఆయన అన్నారు.
పెంపకం దారులు అధైర్య పడవద్దు అని అండగా ఉంటామని తాను ప్రస్తుతం జూబ్లీ ఎన్నికల ప్రచారంలో ఉన్నానని గ్రామానికి వచ్చి బాధితులను కలిసి పరామర్శకు వస్తానని చెప్పారు. మూగజీవాల మరణం పై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తగిన పరిహారం అందించడానికి తనవంతు కృషి చేస్తానని ఈశ్వర్ పెంపకం దారులకు భరోసా కల్పించారు. పరామర్శించిన వారిలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, పలువురు డైరెక్టర్లు దీటీ శ్రీనివాస్, భారత స్వామి సాయిరి కుమార్ , మోర కొమురయ్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్లు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి ,గుర్రం మోహన్ రెడ్డి, నాయకులు ఎం. శంకరయ్య, ఎగ్గేలా స్వామి, దేవి రమణ, ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, కళ్లెం హనుమంత రెడ్డి, నాడెం శ్రీనివాస్, అడువాల రవి, బండారి శ్రీనివాస్, మెన్నేని రాంబాబు, ఎండి రఫీ, అజ్మీర మల్లేశం, మంద శ్రీనివాస్, సత్తనవేణి సదయ్య,అచ్చె రాకేష్, విజ్జగిరి రమేష్, గూడూరి లక్మన్ తదితరులు పాల్గొన్నారు.