కోల్ సిటీ, ఫిబ్రవరి 4: ‘అవ్వ పింఛన్ పైసల్ వస్తున్నయ..? కళ్లు నజర్ ఇత్తనయా… అందరు సల్లంగ ఉండాలె..మళ్లీ కేసీఆర్ అత్తడు…గుబులు పడొద్దు..అప్పటి రోజులు అత్తయ్.. అబద్ధాలతో గద్దెనెక్కి ఆరు గ్యారంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ కు ఈ మున్సిపల్ ఎన్నికల్లో మీ ఓటుతో బుద్ధి చెప్పాలె…బరాబర్ బాకీ తీర్చమని అడుగుదాం..అంటూ రామగుండం నగర పాలక సంస్థ 6వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థి శ్యామని బుధవారం డివిజన్లో మహిళలు, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు.
పేదింటి బీఆర్ఎస్ అభ్యర్థిని శ్యామనికి మద్దతుగా గ్రామ మహిళలు తరలివచ్చారు. దీంతో జనగామ గ్రామం గులాబీమయంగా మారింది. అడుగడుగునా వృద్ధులు, మహిళలు ఆశీర్వచనాలు అందజేశారు. జనగామ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ శ్యామని గ్రామస్తులకు భరోసా కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామస్తులకు బాకీ పడ్డ ప్రతి పథకంపై ప్రచారంకు వచ్చినప్పుడు ప్రశ్నించాలని కోరారు.
రెండేళ్ల క్రితం ఎట్లయితే అబద్ధపు హామీలతో వచ్చి ఓట్లు అడిగి వెళ్లిపోయారో మళ్లీ ఇప్పుడు అవే అబద్ధపు హామీలతో వచ్చి ప్రలోభ పెడుతారనీ, డబ్బులు ఎర చూపి ఓట్లు కొనేందుకు వస్తారనీ గ్రామస్తులంతా అప్రమత్తంగా ఉండాలని విన్నవించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి ప్రజలు ఆదరిస్తే జనగామ గ్రామ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాయకులు తోకల రమేష్, తదితరులు పాల్గొన్నారు.