సుల్తానాబాద్ రూరల్ డిసెంబర్ 09: ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆదేశాల మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా బీసీ జేఏసీ నాయకులు చలో ఢిల్లీ కార్యక్రమానికి భారీగా తరలి వెళ్లారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా చలో ఢిల్లీ కార్యక్రమానికి బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్లు తాళ్లపల్లి మనోజ్ గౌడ్, తాడూరీ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో జిల్లా బీసీ నాయకులు ముకుమ్మడిగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని, సర్పంచ్ ఎలక్షన్స్ నోటిఫికేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని తక్షణమే 42 శాతం రిజర్వేషన్ అమలు కోసం పార్లమెంట్లో కాంగ్రెస్, బిజెపి పార్టీలు బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు .పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘాల నాయకులు చలో ఢిల్లీ కార్యక్రమానికి ముకుమ్మడిగా తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో బీసీ బీసీ జేఏసీ నాయకులు రాజేందర్, నర్సింగోజు శ్రీనివాస్, స్వరూప,మహేందర్, ప్రవీణ్, హర్ష, కవిత, సంతోష్ మరియు బీసీ నాయకులు ఉన్నారు.