రామగిరి జూన్ 11: మంథని మాజీ అసెంబ్లీ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామగిరి మండలానికి చెందిన బర్ల శ్రీనివాస్ ను కాంగ్రెస్ నుంచి బహిష్కరణ చేసినట్లు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రొడ్డ బాపన్న తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా కార్యకర్తను సెల్ ఫోన్లో అసభ్యకరంగా వ్యవరించడం, మరో కాంగ్రెస్ నాయుకుని పై కూడ దురుసుగా మాట్లాడం పట్ల అధిష్ఠానం ఈ విషయలోలో సీరియస్ గా తీసుకుంది.
ఇదే విషయంలో శ్రీనివాస్‌కు మూడు రోజుల కితం షోకాజ్ నోటీస్ జారీ చేశారు. నోటీస్ కు వివరణ ఇవ్వక పోవడంతో పార్టీ నియమ నిబంధన ప్రకారం కాంగ్రెస్ నుంచి బహిష్కరించినట్లు ఆయన తెలిపారు. పార్టీ ఉల్లంఘలనలకు ఎవరు పాల్పడినా పార్టీ పరంగా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.