ధర్మారం, సెప్టెంబర్ 6 : ప్రజలను మోసగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచన పాలన చేస్తుందని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వెయ్యి రోజుల విఫల పాలనపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపుమేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ఊరూరా ఆదివారం కాంగ్రెస్ ఎన్నికల గ్యారెంటీ కార్డులను ఊరూరా పంపిణీ చేశారు. ధర్మారం మండల కేంద్రంలో నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ బలరాం రెడ్డి, పార్టీ పట్టణ శాఖ మాజీ అధ్యక్షుడు తుమ్మల రాంబాబు ఆధ్వర్యంలో స్థానిక పార్టీ నాయకులు బాకీ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బలరాం రెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ పాలనలో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు.
420 హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క బతకాన్ని సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలను మోసగించిందని మండిపడ్డారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కిన సీఎం రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే కేవలం మాజీ సీఎం కేసీఆర్ పైనే ఆరోపణలు చేస్తూ ప్రజా పాలన పేరుతో దగా పాలన చేస్తున్నాడని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకుంటే రాబోయే కాలంలో ఆ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని బలరాం రెడ్డి హెచ్చరించారు. నంది మేడారంలో పార్టీ మాజీ మండల అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు.
ఆయా కార్యక్రమాలలో ధర్మారం మాజీ ఎంపీటీసీ కాంపల్లి చంద్రశేఖర్, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి మల్లారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ ఆవులత, నాయకులు దేవి నలిని కాంత్, దేవి వంశీకృష్ణ, కూరపాటి శ్రీనివాస్, నాడెం శ్రీనివాస్, సల్వాజీ మాధవరావు ,గంధం తిరుపతి, అమరపల్లి నారాయణ, వేల్పుల కుమార్, కాంపల్లి అపర్ణ, ఈర్ల వనిత, కల్లేపల్లి లింగయ్య, ఆవుల వేణు, గాండ్ల నర్సయ్య, అయితే వెంకట స్వామి తదితరులు పాల్గొన్నారు.