‘అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఓటరుగా నమోదు చేసుకోవాలి’
ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన...
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 28 : ఖమ్మం–నల్లగొండ–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన ప్రతి పట్టభద్రుడు తమ ఓటును నమోదు చేసుకోవాలని బీఆర్ఎస్ ఎర్రుపాలెం మండల నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం ఎర్రుపాలెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పట్టభద్రుల సమస్యలను శాసనమండలిలో సమర్థవంతంగా వినిపించేందుకు ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. అర్హులైన పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరారు.
ఓటరు నమోదు కోసం ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు, డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబర్ అవసరమని తెలిపారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు వెంటనే నమోదు చేసుకోవడంతోపాటు, తమ పరిసరాల్లోని ఇతర పట్టభద్రులను కూడా ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ జడ్పీటీసీ శీలం కవిత, మండల కార్యదర్శి యన్నం శ్రీనివాసరెడ్డి, మండల నాయకులు గూడూరు రమణారెడ్డి, శేగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, కుడుముల మల్లికార్జునరెడ్డి, బొర్ర నరసింహారావు, సంక్రాంతి కృష్ణారావు, శ్రీపాలశెట్టి తిరుపతిరావు, గద్దల శ్రీనివాసరావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

