ధర్మారం, జూలై 29: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించడానికి పార్టీ నాయకులు శ్రేణులంతా ఏకతాటిపై నిలబడాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి, చింతలపల్లి, రామయ్యపల్లి గ్రామాలలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు రచ్చపల్లిలో తాళ్ల రాజయ్య, రామయ్యపల్లిలో మార్క బాలయ్య, చింతలపల్లి లో కత్తెర్ల రాజేందర్ పార్టీ గులాబీ జెండాలను ఎగురవేశారు. అనంతరం రచ్చపల్లి గ్రామంలో జరిగిన సమావేశంలో ప్యాక్స్ చైర్మన్ బలరాం రెడ్డి మాట్లాడారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను పురస్కరించుకొని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశానుసారం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో గ్రామాలలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను సమన్వయం చేసి స్థానిక సంస్థల ఎన్నికల కొరకు సంసిద్ధులను చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గత 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీపీ, జడ్పిటిసి స్థానాలతో పాటు మెజార్టీ ఎంపీటీసీ, సర్పంచి పదవులను కైవసం చేసుకుందని నేడు అదే స్ఫూర్తితో గ్రామ గ్రామాన పార్టీ నాయకులందరూ సమన్వయంతో పనిచేసి ఏకతాటిపై నిలవాలని ఆయన సూచించారు. చిన్నచిన్న విభేదాలు ఉంటే వాటిని పక్కనపెట్టి ఐకమత్యంతో పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతుగా నిలిచి విజయ సాధన కోసం అందరూ కృషి చేయాలని ఆయన సూచించారు.
ఆయా కార్యక్రమాలలో ప్యాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజమల్లయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, రచ్చపల్లి మాజీ సర్పంచ్ మోర సుధాకర్, మాజీ ఎంపీటీసీ బెల్లాల రోజా లక్షణ ప్రసాద్, మాజీ ఉపసర్పంచ్ చిందం మల్లేశం,మండల నాయకులు పెంచాల రాజేశం, కాంపల్లి చంద్రశేఖర్, పాక వెంకటేశం, మూల మల్లేశం, చింతల తిరుపతి , సంధినేని కొమురయ్య, ఐత వెంకటస్వామి, దేవి నళినీకాంత్ ,ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణు, దాడి సదయ్య, దొనికెని తిరుపతి ,గుజ్జేటి కనకలక్ష్మి, ఆవుల లత, కాంపల్లి అపర్ణ, మార్క సంధ్య, నెల్లి విజయ, ముక్కెర లావణ్య, అలువాల సరమ్మ, రచ్చపల్లిలో మామిడి శ్రీనివాసరెడ్డి, బైరి సురేష్, బెల్లాల సతీష్, సొల్లు అంజయ్య,మేరుగు సాగర్ ,మేరుగు సత్యనారాయణ,మేరుగు అంజయ్య, ఎండీ అన్వర్, బెల్లాల అనిల్, రామయ్య పల్లి లో వేల్పుల దామోదర్, మార్క ప్రవీణ్, కోట సత్తయ్య, కొమ్మ మహేష్, చింతలపల్లిలో అవుదరి సంతోష్, మామిడి అరుణ్ రెడ్డి, బుర్ర అంజయ్య, కత్తెర్ల ఐలయ్య, నార తిరుపతి, బుర్ర రవి తదితరులు పాల్గొన్నారు.