సుల్తానాబాద్ : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నరసయ్య పల్లి రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బెల్లంపల్లికి చెందిన సోతుకు రమేష్ 51 అనే వ్యక్తితో పాటు బెల్లంపల్లికి చెందిన అంబులెన్స్‌లో మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ నుంచి బెల్లంపల్లి కి వెళ్తున్నారు.
ఈ క్రమంలో నరసయ్య పల్లి వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ ను అంబులెన్స్ వెనుక నుంచి వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలు అంబులెన్స్‌లో ఉన్న రమేష్ అక్కడికక్కడే మృతి చెందగా.. అంబులెన్స్ డ్రైవర్ ప్రవీణ్ కు స్వల్ప గాయాలయ్యాయి.