పెద్దపల్లి : రామగుండం పోలీస్ కమిషనర్‌గా అంబర్ కిశోర్ ఝాను(Amber Kishore Jha) బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం. శ్రీనివాసును సీఐడికి బదిలీ చేయగా.. ఆయన స్థానంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా పనిచేస్తున్న అంబర్ కిషోర్ జాను ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి.
అదేవిధంగా పెద్దపల్లి డీసీపీగా పనిచేస్తున్న చేతనను తెలంగాణ ఉమెన్స్ సేఫ్టీ వింగ్‌కు బదిలీ చేయగా ఆమె స్థానంలో వెయిటింగ్లో ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీ పీ. కరుణాకర్‌ను బదిలీ చేశారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.