కాల్వ శ్రీరాంపూర్ మే 6 : రసాయనిక ఎరువులు వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడడం వల్ల భూసారం పెరిగి పంట దిగుబడి సాధించవచ్చు అని వ్యవసాయ అధికారి సంధ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘99 రోజుల కార్యాచరణ ప్రణాళిక’లో భాగంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ‘రైతు వారము’ అనే కార్యక్రమం బుధవారం పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్, కునారం రైతు వేదికలలో నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాస్త్రవేత్త వినోద్ నేల ఆరోగ్య పరిరక్షణ కి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వరి కొయ్యలు కాల్చడం వలన జరిగే నష్టాలు నెలలో కలియడున్నడం వల్ల కలిగే లాభాలు వివరించారు.
పంట మార్పిడి చేసుకోవడం వలన లాభాలు అధికంగా ఉంటాయన్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు వాడకం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ చదువు రాంచంద్రారెడ్డి, తాసిల్దార్ రాముడు, కెడిసి సి బి మేనేజర్ కరుణ శ్రీ , ఏఎంసీ వైస్ చైర్మన్ రాయమల్లు పాల్గొన్నారు.