సుల్తానాబాద్ రూరల్ మార్చి13 : రైతులకు నాణ్యమైన విద్యుత్(Electricity) అందించడమే లక్ష్యమని కనుకుల ఏఈ దామోదర్ రావు అన్నారు. సిఎండి ఆదేశాల మేరకు మండలంలోని సుద్దాల గ్రామంలో గురువారం విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఏఈ మాట్లాడుతూ.. రైతులకు విద్యుత్ అంతరాయం కలగకుండా పలు చర్యలను చేపట్టామన్నారు. అంతేకాకుండా ట్రాన్స్ఫార్మర్లు, ఎర్త్ తదితర సమస్యలను దృష్టిలో ఉంచుకొని రైతుల పొలాల వద్దకు వెళ్లి సందర్శించారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు వచ్చిన కనుకుల సెక్షన్ కార్యాలయ పరిధిలోని తనకు గాని, విద్యుత్ అధికారులకు సమాచారం ఇస్తే వెంటనే పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో, లైన్ ఇన్స్పెక్టర్ రాజేశం, ఎలఐ రమేష్, లైన్మెన్ ఆరెపల్లి ఐలయ్య, కుమార్, ఎల్ఎం పృథ్వీరాజ్, నరేష్, రాధాకృష్ణ, రంజిత్, అజార్, రైతులు పాల్గొన్నారు.