సుల్తానాబాద్ రూరల్ జనవరి 11 : ఆటో ట్రాక్టర్(Tractor) ఢీకొన్న సంఘటనలో మహిళా మృతి చెందింది. సుల్తానాబాద్ ఎస్ఐ చంద్రకుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దపల్లి(Peddapally )జిల్లా జూలపల్లి మండలం వడకాపూర్ గ్రామానికి చెందిన పలువురు మహిళల కూలీలు ఆదివారం ఆటోలో మానకొండూరు మండలం ఊట్కూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి గ్రామ శివారులో ఆటోను ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న శారద ( 35 ) అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శారద మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.