పెద్దపల్లి రూరల్ జూలై 06: పెద్దపల్లి మండలంలోని పెద్దబొంకూర్లో మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యార్థులకు నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్ డ్రైవ్ ముగిసింది. ఈ మేరకు శనివారం ప్రముఖ కంపెనీలు ఫాక్స్ కాన్, రైటర్, తేజస్ నెట్ వర్క్, ముత్తూట్ ఫైనాన్స్, టాటా టెలి సర్వీస్, టీం లీస్, జెన్ టెక్నాలజీస్, ప్రీమియర్ ఎనర్జీ వారు కళాశాలను సందర్శించి క్యాంపస్ సెలెక్షన్స్ను నిర్వహించారు.ఇందులో దాదాపు 200 మంది పాల్గొనగా 118 విద్యార్థులు ఏంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి. శ్రీనివాస్ తెలిపారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఎడవెల్లి నవీన్ మాట్లాడుతూ తమ కళాశాలలోని విద్యార్థులను ఎంపిక చేయుట వచ్చిన కంపెనీలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల డైరెక్టర్ ఏ. నవత మాట్లాడుతూ తమ కళాశాలలో వంద శాంతం ప్లేస్మెంట్స్ లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.శ్రీనివాస్, కళాశాల అకౌంట్స్ ఆఫీసర్ పి.పవన్ కుమార్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కె.వెంకటేశ్వర్లు, అధ్యాపకులు పాల్గొన్నారు.