Nandimedaram | ధర్మారం,డిసెంబర్ 20: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది రిజర్వాయర్ కట్టపై శనివారం ఉదయం పెద్దపెల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి (క్రాస్ కంట్రీ) పరుగు పందెం పోటీలు బాల, బాలికలకు, యువతి, యువకులకు నిర్వహించారు. బాల బాలికలకు అండర్ -16 కు
2 కి.మీ, అండర్-18 కు 6 కి.మీ,అండర్ -20 కు 8కి.మీ మహిళలకు 10 కి.మీ పురుషులకు 10 కి.మీ లకు పోటీలు నిర్వహించారు. వారంతా ఈ పోటీలలో పోటాపోటీగా పాల్గొన్నారు.
ఈ పోటీలలో కనభరిచిన ప్రథమ ,ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన వారికి అక్కడే పతకాలు నిర్వాహకులు అందజేశారు. రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు జనవరి 2న రంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి కొమ్ముగట్టయ్య ,వ్యాయామ ఉపాధ్యాయులు బైకనీ కొమురయ్య ,అజయ్ మహేష్ ,సురేష్ తదితరులు పాల్గొన్నారు.