PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్2: గ్రూప్ -1 పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన మంథని మండలానికి చెందిన జక్కుల అరుణ్‌కుమార్‌ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష బుధవారం కలెక్టరేట్లో తన చాంబర్లో అభినందించారు.
రాష్ర్ట ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన గ్రూప్ -1 ఫలితాల్లో మండలం ఖాన్ సాయి పేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ కుమార్ రాష్ర్టస్థాయిలో 114వ ర్యాంకు, మల్టి జోనల్ 1 స్థాయిలో 64వ ర్యాంకు సాధించడం పట్ల్ల కలెక్టర్ సంతోషం వ్యక్తం చేశారు.
అరుణ్‌కుమార్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, అతని తల్లిదండ్రులు మల్లేశ్వరి, లక్ష్మీనారాయణను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.