peddamma talli | కమాన్ పూర్, మే 18 : కమాన్ పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని పిల్లి పల్లెలో నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన కార్యక్రమాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద పండితులు గడియారం సత్యనారాయణ శర్మ, గడియారం మనోజ్ శర్మ, గడియారం వేణు శర్మ ఆధ్వర్యంలో పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పెద్దమ్మతల్లి విగ్రహ ప్రతిష్టాపనను జలాధివాసం, ధాన్యాదివాసం, పుష్పాదివాసం, ఫలాదివాసం, మహిళల చే కుంకుమ పూజ జరిపించారు.
ఉదయం భార్య భర్తల జంటలచే హోమం నిర్వహించారు. అలాగే కల్ష పూజ గణపతి పూజ నిర్వహించారు స్వస్తి పుణ్యా వచనం తదితర పూజా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. అలాగే అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం నుండి భక్తులు భారీ ఎత్తున హాజరై వివిధ పూజలను నిర్వహించారు. ఈ వేడుకలకు గాను పిల్లి పల్లె తదితర గ్రామాల నుండి భక్తులు హాజరయ్యారు.