తెలంగాణ చౌక్, మార్చి 7 : కరీంనగర్ ఆర్టీసీ బస్సులో(RTC bus) ప్రయాణికుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ అధికారులు తెలిపిన తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వడ్డేపల్లి ఓదేలు (55) కరీంనగర్ లోని ఏటీఎంలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. శుక్రవారం డ్యూటీ నిమిత్తం కరీంనగర్ వెళ్లడానికి జమ్మికుంట నుంచి కరీంనగర్ వస్తున్న పల్లె వెలుగు బస్సు ఎక్కాడు.
కరీంనగర్ చేరుకున్న బస్సులో నుంచి ప్రయాణికులు అందరూ దిగిపోగా ఓదేలు ఒక్కడే సీటులో ఉండడాన్ని గమనించిన కండక్టర్ అతని వద్దకు వెళ్లి పలకరించగా మాట్లాడకపోవడంతో అనుమానం వచ్చి ఆర్టీసీ ట్రాఫిక్ కంట్రోలర్ సురేష్ తెలిపారు. వారు 108 కి సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది ఓదేలును పరిశీలించి మృతి చెందినట్టు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. బస్టాండ్ కు చేరుకున్న పోలీసులు ఓదేలు మృత దేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.