local body elections | పెగడపల్లి: త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీ శ్రేణులు పని చేయాలని పెగడపల్లి మండల బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని నామాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ గ్రామ శాఖ సమావేశం మాజీ సర్పంచ్ ఇనుగొండ్ల కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాదించాలన్నారు.
యూరియా దొరకక రైతులు పడుతున్న ఇబ్బందులు, ఆరు గ్యారంటీల అమలులో విఫలం వంటి విషయాలపై స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారం చేయాలని మల్లారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఇనుగాండ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చిత్ర రజిత-రమణాకర్, మాజీ ఉప సర్పంచ్ పెద్ది సంతోష్, గ్రామ శాఖ అధ్యక్షుడు ఉసికె గంగరాజం, మండల నాయకులు ఉప్పుగండ్ల నరేందర్రెడ్డి, తిర్మణి నర్సింహరెడ్డి, ఉప్పలంచ లక్ష్మణ్, రాచకొండ ఆనందం, మడిగెల తిరుపతి, నాగుల రాజశేఖర్ గౌడ్, పలుమారు విజయ్ యాదవ్, భోగ లక్ష్మినారాయణ, కాశెట్టి వీరేశం, సత్తయ్య, లక్స్మారెడ్డి, నబీ, కుమార్, లింగయ్య, రాజయ్య, దేవయ్య, గంగాచారి, తిరుమలేష్, శ్రీనివాస్ తదితరులున్నారు.