Demanding justice | మంథని, జూన్ 21: పోలీసు కేసు, దెబ్బలకు భయపడి ఆత్మహత్యయత్నానికి పాల్పడి అచేతన స్థితిలోకి వెళ్లిన యువకుడిని అంబులెన్స్ లో ఉంచి తల్లిదండ్రులు స్థానికుల సాయంతో ధర్నాకు దిగిన సంఘటన పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. బాధితుడి తండ్రి దేవేందర్ వివరాల ప్రకారం… గత ఖరీఫ్ పంట కొనుగోలు సమయంలో వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద గొడవలు పాల్పడుతున్నారు అంటూ కొంతమంది ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో అకారణంగా తన కుమారుడిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో పాటు కొట్టారని ఆరోపించారు.
కేసు కారణంగా మనస్థాపానికి గురైన తమ కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని వాపోయారు. న్నారు. తన కొడుకును బతికించుతూనేందుకు తాను తీవ్రంగా శ్రమించానని ఆవేదన వ్యక్తం చేశాడు. తన కుమారుడు కోమాలో ఉంటూ అచేతనంగా మంచానికే పరిమితమయ్యాడు. నా కొడుకు ఇంత అన్యాయం జరిగినా నా కొడుకుకు ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల పై ఇప్పటివరకు ఎలాంటి కేసులు నమోదు చేయలేదని, వైద్య ఖర్చులకు నష్టపరిహారం కూడా అందించడం లేదని వాపోయాడు. పైగా నన్ను నా కుటుంబాన్ని బెదిరింపుల గురి చేస్తున్నారన్నారు.
ఈ విషయంపై ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్ కి వెళ్ళినా పట్టించుకోవడం లేదన్నారు. దీంతో విసుకు చెందిన తాను అంబేద్కర్ చౌరస్తాలో ధర్నాకు దిగాను అన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి బాధితుడికి నచ్చచెప్పి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. సుమారు గంటపాటు ఈ ధర్నా కొనసాగగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది.