Dharmaram | పిల్లల చదువులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి.. పెద్దపల్లి డీఈవో శారద
పిల్లల చదువులపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని జిల్లా విద్యా అధికారి గద్వాల శారద సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్లో ధర్మారం సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ జోష్ పేర-23 వ వార్షికోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు.

Dharmaram | ధర్మారం, మార్చి 26: పిల్లల చదువులపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని జిల్లా విద్యా అధికారి గద్వాల శారద సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామంలోని మహేశ్వర ఫంక్షన్ హాల్లో ధర్మారం సాయి మణికంఠ మోడ్రన్ హై స్కూల్ జోష్ పేర-23 వ వార్షికోత్సవ వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన డీఈవో శారద మాట్లాడుతూ పాఠశాలలకు తమ పిల్లలు వెళ్లి చదువుకుంటున్న క్రమంలో వారిపై తల్లిదండ్రులు దృష్టి సారించి వారు ఎలా విద్యను అభ్యసిస్తున్నారనే దానిని గమనించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ముఖ్యంగా పిల్లలను మొబైల్ ఫోన్ లకు తల్లిదండ్రులు దూరంగా ఉంచాలని ఆమె పేర్కొన్నారు. . విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఆమె సూచించారు. గత ఏడాది టెన్త్ లో పాఠశాల 100శాతం ఉత్తీర్ణత సాధించడం అభినందనీయమని, అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా ఉత్తీర్ణత సాధించాలని ఆమె ఆకాంక్షించారు .ఈ కార్యక్రమానికి పాఠశాల కరస్పాండెంట్ జైన సురేష్ కుమార్ అధ్యక్షత వహించగా మండల విద్యాధికారి పొతు ప్రభాకర్, పాఠశాల ఎండీ జైన రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

