Parents’ Day | మెట్పల్లి, జూలై27 : మెట్పల్లి పట్టణంలోని ఖాదీ ఆవరణలోని ఆంజనేయస్వామి ఆలయం ఆవరణలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేరెంట్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గీత సత్సంగ్ కార్యక్రమంలో భాగంగా హాజరైన 25 మంది తల్లిదండ్రుల జంటలను శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వెల్ముల శ్రీనివాసరావు, సభ్యులు జైపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, ఇల్లెందుల శ్రీనివాస్, ఆంజనేయులు, కిషన్, మర్రి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.