కమాన్చౌరస్తా, మే 13 : సీబీఎస్ఈ పదో తరగతి వార్షిక ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పారమిత హెరిటేజ్ పాఠశాల, పారమిత వరల్డ్ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారని పారమిత విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఈ ప్రసాద రావు హర్షం వ్యక్తం చేశారు. 500 మారులకు గానూ ఆకుల శ్రీరామ చంద్ర 488 మారులు, రూపనిగమ, మనోజ్ఞ 487, స్ఫూర్తి 481, బీ వర్షిణి 480 మారులు సాధించారని చెప్పారు. 62 మంది విద్యార్థులు 90 శాతం పైన మారులు పొందారని, 80 నుంచి 100 శాతం సాధించిన విద్యార్థులు 160 మంది ఉన్నారని, వంద శాతం ఉత్తీర్ణత నమోదైందని చెప్పారు.
పారమిత విద్యాసంస్థలలో నైపుణ్యాలకు పెద్దపీట వేసి ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని తట్టుకునేలా విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దుతున్నామన్నారు. అనంతరం విద్యార్థులను అభినందించారు. ఇక్కడ డైరెక్టర్లు ప్రసూన, అనుకర్ రావు, రశ్మిత, రాకేశ్, ప్రాచీ, వినోదరావు, వీయూఎం ప్రసాద్, టీఎస్వీ రమణ, హన్మంతరావు ప్రధానోపాధ్యాయులు ఎం శ్రీకర్, గోపికృష్ణ సమన్వయకర్తలు రవీంద్ర పాత్రో, నాగరాజు, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.