ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వ జనోద్దరణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆయా వర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో అణగారిపోయి, బతుకుదెరువు కోసం అష్ట కష్టాలు పడ్డ అనేక కులాలను అక్కున చేర్చుకుంటూ వారి అభ్యున్నతికి బాటలు వేస్తున్నది. ఇప్పటికే అనేక రకాల ప్రభుత్వ ఫలాలను అందిస్తుండగా, తాజాగా మంచిర్యాల జిల్లా వేదికగా సీఎం కేసీఆర్.. బీసీ కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం, రెండో విడుత గొర్రెలు, గృహలక్ష్మి పథకం కింద పేదలకు స్థలాలు పంపిణీ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. దివ్యాంగులకు వచ్చేనెల నుంచి రూ.4,016 పింఛన్ అందిస్తామని ప్రకటించి మరోసారి ముఖ్యమంత్రి తన మానవత్వాన్ని చాటుకోగా, సకల జనులు సంబురాలు చేసుకుంటున్నారు. ఊరూరా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ, కృతజ్ఞత చాటుతున్నారు. ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని కోరుతున్నారు.
– కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ)
ఇచ్చిన మాట నిలవెట్టుకున్నరు మాది పేద కుటుంబం. నేను బీడీలు జేస్త. నా భర్త పైండ్ల రాజు కైకిలి పోయేటోడు. మూడేండ్ల కింద నా భర్త బండిమీద పోంగ యాక్సిడెంటయ్యింది. అప్పటి సంది కోమాలోకి పోయి మంచానికే పరిమితమైండు. మా మామ కట్టిన ఇల్లును దావఖాన ఖర్చుల కోసం అమ్మినం. అయినా ఉలుకూలేదు.. పలుకూలేదు. మా బాధ తెల్సుకున్న మా ఎమ్మెల్యే రవిశంకరన్న వాళ్ల ఇంటికి పిలిపించుకొని ‘బిడ్డా నేనున్నా భయపడకు’ అన్నడు. మీకు ఇల్లు కట్టుకునేతందుకు గవర్నమెంట్ భూమి ఇప్పిస్తనన్నడు. ఇచ్చిన మాట నిలవెట్టుకొని మాకు శుక్రవారం నాడు గంగాధరల పట్టా ఇచ్చిండు. మాకు సాయంజేసిన కేసీఆర్ సారు, ఎమ్మెల్యే రవిశంకరన్న సల్లగుండాలె.
– పైండ్ల నవ్య, గోపాల్రావుపేట (రామడుగు)
కరీంనగర్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఇటు అభివృద్ధి, అటు సంక్షేమం రెండు కండ్లలా భావించి సమపాళ్లలో నిధులు కేటాయిస్తున్నది. అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తూనే, సంక్షేమానికి భారీగా నిధులు కేటాయించి అమలు చేస్తున్నది. అందులో భాగంగా రైతులకు ఉపయోగపడే విధంగా రైతుబంధు, రైతుబీమా, పంట రుణమాఫీ, వంటి పథకాలను అమలు చేస్తోంది. మహిళా సం క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కల్యాణలక్ష్మి, షాదీముబాకర్, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్స్, ఆరోగ్య లక్ష్మి వంటి పథకాలను అమలు చేస్తోంది. తెలంగాణ ఆసరా పథకం కింద వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులకు పెన్షన్లు అందిస్తోంది.
గొర్రెల పంపిణీ, చేనేత మిత్ర వంటి పథకాలు అమలు చేస్తున్నది. ముఖ్యంగా దళితబంధు పథకంతో ఈ వర్గాల్లో ఆర్థిక వెలుగులు పంచుతున్నది. ఈ పథకం దేశంలోనే సంచలనం సృష్టించింది. తాజాగా గృహలక్ష్మి పథకం కిం ద పేదలకు ఇండ్ల స్థలాలు పంపిణీ చేయడం, డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడాన్ని ప్రారంభించింది. వెనకబడిన కులాల్లోని చేతి వృత్తుల వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం లక్ష ఆర్థిక సహాయం పథకాన్ని ప్రవేశ పెట్టింది. మంచిర్యాలలో సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీంతో చేతి వృత్తులపై ఆధారపడిన అనేక కులాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఇప్పటికే 3,016 పెన్షన్ అందుకుంటున్న దివ్యాంగులకు సీఎం కేసీఆర్ మరో తీపి కబురు వినిపించారు. వారికి నెలవారిగా ఇచ్చే ఈ మొత్తం సరిపోవడం లేదని గ్రహించి ఎవరూ అడగక ముందే 4,016 ఇస్తామని ప్రకటించి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
కరీంనగర్ జిల్లాలోని 23,750 మంది దివ్యాంగులకు నెలకు వెయ్యి చొప్పున అదనపు ప్రయోజనం చేకూరనుంది. మొదటి విడత గొర్రెల పంపిణీ కింద ఇప్పటికే 14,761 యూనిట్లు పంపిణీ చేశారు. రెండో విడుత కింద 9,573 యూనిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇపుడు యూనిట్ విలువ 1.75 లక్షలకు పెంచారు. దీం తో గొల్ల కుర్మల్లో కూడా హర్షం వ్యక్తమవుతున్నది.
సిరిసిల్ల జిల్లాలో 10234మంది దివ్యాంగులకు నెల కు వెయ్యి చొప్పున అదనపు ప్రయోజనం చేకూరనుం ది. వీరికి ప్రస్తుతం ప్రతి నెలా ప్రభుత్వం 4.21 కోట్లు చెల్లిస్తున్నది. తాజా మరో వెయ్యి పెంచడంతో 2.4 కోట్ల అదనంగా చెల్లించాల్సి ఉంది. జిల్లాలో మొదటి విడుతలో 16,162మందికి పంపిణీ చేశారు. అయితే రెండో విడతలో 4,620మందికి పంపిణీ చేయాల్సి ఉంది.
సంబురాలే సంబురాలు
దివ్యాంగులకు రూ.4,016 ఆసరా పెన్షన్లు పెంచడం, రెండో విడత గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టడం, కుల వృత్తుల వారికి లక్ష ఆర్థిక సహాయం అందించడం వంటి కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టడంతో జిల్లా లో ఈ వర్గాలు సంబురాలు చేసుకున్నాయి. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి గంగుల కమలాకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సంఘం నాయకులు జక్కం సంపత్, అంజన్రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు ఎడ్ల అశోక్ పాల్గొన్నారు. సైదాపూర్ మండలం కొత్త బస్టాండ్‌లో దివ్యాంగులు సీఎం కేసీఆర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఇటు వీణవంక మండల కేంద్రంలో కూడా దివ్యాంగులు కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఇలా అన్ని వర్గాల ప్రజలు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సంబురాలు చేసుకున్నారు.
మా దేవుడు సీఎం కేసీఆర్
సకల బాధలతో సతమతమవుతున్న దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటూ, ప్రత్యక్ష దైవంగా సీఎం కేసీఆర్ మారాడు. తమకు పింఛన్ పెంచాలంటూ చేసిన ఒక్క ప్రకటనకే స్పందించి1,100 పెంచి, తమ సంక్షేమంపై ఆయన కున్న చిత్తశుద్ధిని చాటుకు న్నాడు. తమను సకలాంగుల తో సమానంగా చూడాలనే సంకల్పంతో ఇప్పటికే బ్యా టరీ సైకిళ్లు, మూడు చక్రాల వాహనాలు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు ఇప్పించి ప్రోత్సహించారు.
– జక్కం సంపత్, వీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్షుడు (కార్పొరేషన్)
కేసీఆర్ సార్ నిండు నూరేళ్లు బతకాలి
కేసీఆర్ సార్ నిండు నూరేళ్లు బతకాలి. కేవలం పింఛన్ మీద ఆధారపడి బతుకుతున్న నాలాంటి పేదోళ్లను దుకో వడం ఎప్పటికీ మరిచిపోను. సార్ ఇచ్చే పింఛన్‌తోనే గౌరవంగా బతుకున్న. గత ప్రభుత్వాలు కేవలం 500 ఇచ్చి చేతులుదులుపుకున్నయి. కానీ కేసీఆర్ సర్కారు 3,016 ఇస్తంది. ఇప్పుడు మరో వెయ్యి పెంచడం చెప్పలేనంత ఆనందగా ఉంది. కేసీఆర్ సార్, బీఆర్ఎస్ సర్కారుకు రుణపడి ఉంటా.
– గడ్డె రాజమల్లు, హిమ్మత్‌నగర్(వీణవంక)
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు..
దివ్యాంగులకు సీఎం కేసీఆర్ అండగా నిలుస్తు న్నారు. ఇప్పటికే 3,016 పింఛన్ ఇస్తున్నడు. ఇపుడు మరో వెయ్యి పెంచి వచ్చే 4,116 ఇస్తామని ప్రకటించినందుకు ధన్యవాదాలు. బీఆర్ ఎస్ సర్కారు దివ్యాంగులకు అనేక రకాలుగా భరో సా ఇస్తున్నది. ప్రత్యేకంగా ట్రై సైకిల్స్ ఇస్తున్నది. పరికరాలు, ప్రత్యేక రుణాలు ఇస్తూ కంటికిరెప్పలా చూసుకుంటున్నది.
– శ్రీనివాస్, దివ్యాంగ సమాచారం, వ్యవస్థాపక అధ్యక్షుడు, (హుజూరాబాద్‌టౌన్)
కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం
మంచిర్యాలలో సీఎం కేసీఆర్ దివ్యాంగుల కష్టాలను గుర్తించి, దేవుడే అతని నోట చెప్పించినట్లుగా అడగకుం డానే 3,016 పింఛన్‌ను మరో వెయ్యి పెంచడం ఎన్నటికీ మర్చిపోం. సీఎం నిర్ణయంతో దివ్యాంగులు సంతోషంగా ఉన్నారు. దివ్యాంగులు కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేయడం అనేది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఆయన మాకు చేస్తున్న ఉపకారానికి మేం ఎంత చేసిన, ఏమి ఇచ్చిన మా రుణం కేసీఆర్ సార్‌కు తీరనిది. సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా.
– శీలం రాజురెడ్డి, బీఆర్ఎస్ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు
‘కేసీఆర్‌తో కుల వృత్తులకు నుమడించిన గౌరవం’
నాపేరు నాంపల్లి ఆదిత్య. మాది శంకరపట్నం మండ లం వంకాయ గూడెం. కులవృత్తులనే నమ్ముకుని బతుకుతున్నం. మా నాన్న లాండ్రీ షాపు నిర్వహిస్తూ, ఉన్న కొద్దిపాటి పొలా న్ని సాగు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ప్రస్తుతం నేను డ్రైక్లీనింగ్ షాపు నడుపు తున్న. అయితే గతంలో మాకు ఏ ప్రభుత్వం ఆసరా గా నిలబడలే. ఉచిత కరెంట్ తోపాటు కులవృత్తిలో నిలదొక్కు కొనేందుకు లక్ష ఆర్థిక సాయం అందజేసిన సీఎం కేసీఆర్‌కు పాదాభివందనాలు.
– నాంపల్లి ఆదిత్య, వంకాయగూడెం (శంకరపట్నం)
స్వరాష్ట్రంలోనే దివ్యాంగులకు న్యాయం..
పుట్టుకతోనే అవిటివారిగా మారి ఏ పనీ చేసుకోలేని స్థితిలో మాలాంటి వారి బతుకులు గత ప్రభుత్వాల పాలనలో ఎంతో దుర్భరంగా ఉండేవి. నెలకు 500 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునేవి. నెలంతా గడ వాలంటే పడరాని పాట్లు పడేవాళ్లం. మా కష్టాలను గుర్తించి సీఎం కేసీఆర్ 3,016 పింఛన్ ఇస్తుడు. ఇప్పుడు 4,016 చేసిండు. ప్రభుత్వం ట్రై సైకిళ్లు కూడా అందజేసింది. ఊపిరి ఉన్నంత వరకు కేసీఆర్ వెంటే ఉంటాం.
– పీ శ్రీనివాస్, దివ్యాంగుల సంఘం మండలాధ్యక్షుడు, రెడ్డిపల్లి (వీణవంక)
ఇసోంటి సీఎంను ఎక్కడా చూడలే..
మాది పేద కుటుంబం. నా భార్య ఇంటింటికీ వెళ్లి బట్టలు ఉతుకుతది. నేను ఇంటి వద్ద బట్టలు ఇస్త్రీ చేస్తా. సీఎం కేసీఆర్ సారు మా లాండ్రీ షాపులకు 250 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నడు. గతంలో మేం చేసిన కష్టమంతా కరెంట్ బిల్లులకే పోయేది. అప్పుడు రేటు తక్కువ. బిల్లు ఎక్కు వ ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రీ కరెంట్‌తో నాలుగు పైసలు మిగులుతున్నై. రజక కులస్తులకు లక్ష సాయం చేస్తుండడం సంతోషంగా ఉంది. ఇసోంటి సీఎంను ఎక్కడా చూడలే.
– రావుల ఎల్లయ్య, రజక సంఘం మండలాధ్యక్షుడు (ఇల్లందకుంట)
లక్ష సాయం మరువలేనిది..
నేను 30 ఏండ్లుగా క్షౌరవృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. గుంట భూమి కూడా లేదు. ఏరోజు వచ్చిన డబ్బులతో ఆ రోజు పూట గడుపుకునే వాళ్లం. గతంలో ఏ సర్కారోల్లు పట్టించుకోలేదు. రాష్ట్రం వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ సార్ రూపాయికి కిలో బియ్యం, సెలూన్లకు ఉచితంగా కరంటు ఇచ్చిండు. ఇప్పుడు లక్ష సాయం చేస్తండు. పైసలతో షాపును పెద్దగా చేసుకుంటా. రాష్ట్రం వచ్చినప్పటి నుంచే ఐదేళ్లు నోట్లోకి పోతున్నాయి. గత ప్రభుత్వాలు మా కుల వృత్తిని పట్టించుకోలే. ఏ సాయమూ చేయలేదు. స్వరాష్ట్రంలోనే మాకు ఇంత భరోసా దొరికింది. సీఎం సార్‌కు రుణపడి ఉంటాం.
– తిప్పబత్తిని సదానందం (హుజూరాబాద్‌రూరల్)