Vodithela Pranav | హుజూరాబాద్ టౌన్, జూన్ 22 : హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధే తమ ప్రధాన లక్ష్యమని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. పట్టణ పరిధిలోని దమ్మక్కపేటలో రూ. 20లక్షలతో చేపట్టిన పైప్ లైన్ పనులను ఆయన ఆదివారం ప్రారంభించారు.
అనంతరం ప్రణవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఏళ్ళుగా ఎదురుచూస్తున్న ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా పరిష్కరిస్తుందని, భవిష్యత్ లో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ పట్టణ, మండల అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.