Open House | గన్నేరువరం,అక్టోబర్23: పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మండలకేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో గురువారం ఓపెన్ హౌజ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులకు పోలీస్ శాఖ కార్యకలాపాలు, నేరాల నివారణ, ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నరేందర్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.