Singareni | గోదావరిఖని : సింగరేణి సంస్థ రామగుండం డివిజన్-1 పరిధిలోని జీడీకే ఓసీ-5 సరికొత్త బొగ్గు రవాణా రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు 13,024 టన్నుల బొగ్గు డిస్పాచ్ చేయడం ద్వారా ఈ రికార్డును సాధించారు. జీడీకే ఓసీ-5 గని బొగ్గు డిస్పాచ్ లో (02.09.2026)న 8907 టన్నుల లక్ష్యానికి గాను 13,024 టన్నుల బొగ్గును డిస్పాచ్ చేసి 146శాతం లక్ష్యాన్ని సాధించింది.
ఈ ఘనత సాధించిన, సూపర్ వైజర్లు, కార్మికులు, కాంట్రాక్ట్ సిబ్బంది యూనియన్ నాయకులను అధికారులను ఆర్జీ-1 జనరల్ మేనేజర్ డీ లలిత్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్ని గనులు కుడా పనిచేసి వార్షిక లక్ష్యాలను సాధించాలని బొగ్గు ఉత్పత్తి తో పాటు రవాణాలో కూడా వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని జీఎం పిలుపునిచ్చారు.