Asian Games : ఆసియా క్రీడల (Asian Games) బాక్సింగ్ (Boxing) విభాగంలో భారత్‌కు తొలి పతకం (First Medal) ఖాయమైంది. భారత బాక్సర్ అంకుష్ పంగల్ (Ankush Panghal) 80 కిలోల విభాగంలో అదరగొట్టాడు. ఆదివారం ఉదయం జరిగిన పురుషుల క్వార్టర్ఫైనల్లో తజికిస్థాన్ (Tajikistan) కు చెందిన నెక్రుజ్ సలీమోవ్ (Nekruz Salimov) ను 5-0 తేడాతో ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు.
తొలి రౌండ్ నుంచే ఆధిపత్యం ప్రదర్శించిన అంకుష్ తన ప్రతిభతో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. గత నెల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో అంకుష్ స్వర్ణం సాధించాడు. ఆసియా క్రీడల్లో తొలిసారి బరిలోకి దిగిన అంకుష్.. తొలి ప్రయత్నంలోనే పతకం ఖాయం చేసుకున్నాడు. సెమీఫైనల్‌కు చేరి భారత బాక్సింగ్‌లో తన స్థానాన్ని మరింత బలపరచుకున్నాడు.