KTR | సీఎం రేవంత్ రెడ్డికి FTL పరిధిలోని కాంగ్రెసోళ్ల ఇళ్లు కూల్చే దమ్ము లేదు కానీ.. పేదోళ్ల ఇళ్లను మాత్రం నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్నికార్తీక్ తీసుకొనిపోయిండు.. మూసీ దగ్గరకు పోయినం. హైదర్ షా కోట్, బాపూఘాట్ నుంచి కిందికి.. అక్కడ కాలనీవాళ్లందరూ మాకు సమస్య ఉంది. మా ఇండ్లు కూలగొడతరంటా.. ఇండ్లు రిజిస్ట్రేషన్లు వాళ్లే చేసిర్రు.. డబ్బులు కట్టించుకున్నరు.. మేం ఈఎంఐలు కడుతున్నం. మేం రోడ్డున పెడితే ఎక్కడ చావాలే.. ఏం చేయాలే దయచేసి రండి అంటే మేమంతా పోయినం. 3-4 కిలోమీటర్లు పాదయాత్ర చేసినం.. ఆ రోజు పాదయాత్ర చేసినం. నాకు బాగా గుర్తుంది. ఆ రోజు అక్కడుండే పిల్లలొచ్చి చెప్పారు.. అంకుల్ మా కిడ్డీ బ్యాంక్ తీసుకోండి.. రేవంత్ రెడ్డికి కమీషన్లు కావాలంటే కిడ్డీ బ్యాంక్ పైసలిస్తం. కానీ మా ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నడు చెప్పండి.. ఎవరు చెప్పాలి సమాధానం.. మూసీ మంచిగా చేయడానికి రాదా.. ఇండ్లు కూలగొట్టకుండా చేయరాదా..? మన ప్రభుత్వంలో మనం అదే ప్రణాళిక రూపొందించినం. అద్భుతమైన ప్రణాళికలు వేసి రూ.16వేల కోట్లతో మూసీని ఎలా చేయవచ్చో మన ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడమే కాకుండా కొంత పని కూడా మనం చేసేసినమన్నారు.
హైదరాబాద్లో 58, 59 జీవోల కింద 2 లక్షల మంది పేదలకు పట్టాలిచ్చి, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిన నాయకుడు కేసీఆర్ అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. రేవంత్ గద్దెనెక్కి మూడేళ్లవుతున్నా.. హైదరాబాద్లో ఒక్క కొత్త ఇల్లు కట్టకపోగా, ఉన్న ఇళ్లను కూలగొడుతున్నాడని ఫైర్ అయ్యారు. ఉన్న నగరం దోమల బెడదతో అల్లాడుతుంటే.. కొత్తగా ‘ఫ్యూచర్ సిటీ’ అని డ్రామాలు ఆడుతున్నాడని..FTL పరిధిలోని కాంగ్రెసోళ్ల ఇళ్లు కూల్చే దమ్ము లేదు కానీ.. పేదోళ్ల ఇళ్లను మాత్రం రేవంత్ నిర్దాక్షిణ్యంగా కూలుస్తున్నాడని మండిపడ్డారు.
హైదరాబాద్లో 58, 59 జీవోల కింద 2 లక్షల మంది పేదలకు పట్టాలిచ్చి, లక్ష డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించిన నాయకుడు కేసీఆర్.
రేవంత్ గద్దెనెక్కి మూడేళ్లవుతున్నా.. హైదరాబాద్లో ఒక్క కొత్త ఇల్లు కట్టకపోగా, ఉన్న ఇళ్లను కూలగొడుతున్నాడు.
ఉన్న నగరం దోమల బెడదతో అల్లాడుతుంటే.. కొత్తగా ‘ఫ్యూచర్… pic.twitter.com/zT6NydEZMg
— BRS Party (@BRSparty) September 27, 2026
Nivetha Pethuraj | సినిమాలు మానేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నా.. నివేదా పేతురాజ్ సంచలన విషయాలు
The Paradise | వీక్ డేస్లోను తగ్గని ‘ది ప్యారడైజ్’ జోరు.. మూడో రోజు కూడా భారీ బుకింగ్స్!