ఆదిలాబాద్ : ఆదిలాబాద్ ( Adilabad ) గ్రామీణ మండలంలో సాంగ్వి గ్రామానికి చెందిన తీగల రమేశ్ (47) అనే రైతు బలవన్మరణానికి (Farmer Suicide ) పాల్పడ్డారు.
8 ఎకరాల్లో పత్తి, కంది సాగు చేసిన రమేశ్ సరిపడా వర్షాలు లేక పంట దిగుబడి తగ్గడంతో ఆర్థిక ఇబ్బందులకు గురయ్యాడు.
వ్యవసాయ సహకార బ్యాంకులో తీసుకున్న సుమారు రూ.15 లక్షల రుణం అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందినట్లు కుటుంబీకుల వెల్లడించారు. చనాఖా–కోర్ట కెనాల్ సమీపంలో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.