Bandi Sanjay | కొడిమ్యాల : కొడిమ్యాల మండల కేంద్రంలో రూ.3.5 కోట్ల కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కొడిమ్యాల మండలాన్ని ,చొప్పదండి నియెజకవర్గాన్ని, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తరువాత ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు రూ.65 లక్షల నిధులతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. కొడిమ్యాల మండల కేంద్రంలో 3 కోట్ల 50 లక్షల రూపాయల కేంద్ర నిధులతో వివిధ రోడ్లు, అభివృద్ధి పనులను ప్రారంభించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. అందులో భాగంగా రూ.3.5 కోట్ల కేంద్ర నిధులతో కొడిమ్యాల మండంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను కలిసి ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు.
రాజకీయాలకు అతీతంగా కలిసి పనిచేస్తే అభివృద్ధి ఏ విధంగా ఉంటదో చూపిస్తాం అన్నారు బండి సంజయ్. ముఖ్యంగా చొప్పదండి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. అందుకోసం రాబోయే రోజుల్లో కేంద్రం నుండి అధిక నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులు పూడూర్ బస్టాండ్ నుండి కొడిమ్యాల అంబేద్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీతో స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, బీజేపీ మండల అధ్యక్షులు బండ నరసింహారెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు రేకులపల్లి రవీందర్ రెడ్డి కొడిమ్యాల తాజా మాజీ సర్పంచ్ ఏలేటి మమత నర్సింహారెడ్డి, బీజేపీ మండల నాయకులు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, నాంపల్లి రాజేశం శ్రీనివాస్ రెడ్డి, బైరి హరీష్ బండ, లింగారెడ్డి, బుచ్చి రాములు, శేఖర్, శోభన్, మచ్చ రాజు, రాకేష్, భూమేష్, చిరంజీవి, మహేందర్, నాగరాజు, ప్రశాంత్, సాయిబాబా, బల్కం రాజు, పులి తిరుపతి, శ్రీను, విక్రమ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Shadnagar | రెండు గంటలైనా రాని 108 అంబులెన్స్.. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
Kunal Kamra | కమెడియన్ కునాల్ కమ్రాకు బాంబే హైకోర్టులో ఊరట
KTR | ఏడాది పాటు బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు చేస్తాం : కేటీఆర్