Road accident | కోరుట్ల జూలై 24: కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్డు ఆదర్శనగర్ మూలమలుపు వద్ద జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శనగర్ మూలమలుపు వద్ద కారు టర్నింగ్ తీసుకునే సమయంలో డివైడర్ను ఢీకొని రోడ్డుపై ఆగిపోయింది.
మెట్పల్లి నుంచి కోరుట్లవైపు వస్తున్న లారీ డ్రైవర్ రోడ్డుపై కారు ఆగి ఉండడాన్ని గమనించి లారీని కారు వెనకాల ఆపాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మరో లారీ ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెనకనుంచి ఢీకొన్న లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రుడిని ప్రభుత్వాసుపత్రి తరలించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన చేరుకొని క్రేన్ సాయంతో లారీలను పక్కకు జరిపి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.