Sucide | కాల్వశ్రీరాంపూర్. జూలై 17 : ఉరి వేసుకుని ఒకరు అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన మండలంలోని కునారం గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. కునారం గ్రామానికి చెందిన పులిపాక సంపత్ (32) గురువారం తన ఇంటిలో ఉరివేసుకున్నాడు.
గమనించిన కుటుంబ సభ్యులు ఉరి తీసి కాల్వ శ్రీరాంపూర్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే సంపత్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పులిపాక సంపత్ స్వగ్రామం కమాన్పూర్ మండలం రొంపి కుంట కాగా కునారం గ్రామానికి చెందిన దొడ్ల రాజేశ్వరిని పెళ్లి చేసుకుని భార్యతో కలిసి ప్రస్తుతం కునారంలోనే ఉంటున్నాడు. పులిపాక సంపత్ మృతి అనుమానస్పదంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.