Vemulawada | వేములవాడ రూరల్, మర్చి 6 : వేములవాడ మండలం కొడుముంజ అర్ అండ్ అర్ కాలనీ సమీపంలో రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
వేములవాడ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం వేకువజామున నాంపల్లి వైపు నడుచుకుంటూ వెళుతున్న ఓ వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గుర్తుతెలియని మృతదేహం కావడంవల్ల కొడుముంజ పారిశుద్ధ కార్మికులు ట్రాక్టర్లు మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.