suicide | ముత్తారం, జులై 16: నాడు కొడుకు పురుగుల మందుతాగి మరణించగా నేడు తండ్రి పురుగుల మందుతాగి మరణించిన సంఘటన మండల కేంద్రంలోని కాసర్లగడ్డలో చేటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గత సంవత్సరం జులై 29న తండ్రి మందలించాడని కొడుకు మారం రమేష్ రెడ్డి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కొడుకు చనిపోవడంతో అప్పటి నుండి తండ్రి మారం రాజీరెడ్డి (59) బాధపడుతూ ఉండేవాడని తెలిపారు. అదే బాధలో మంగళవారం సాయంత్రం రాజీరెడ్డి ఎదో పురుగుల మందుతాగి ఇంటివద్ద పడిపోయి ఉండగా కూలీపనికి వెళ్లి ఇంటికి వచ్చిన మృతుని భార్య పద్మ చూసి స్థానికుల సహాయంతో పెద్దపల్లి ప్రభుత్వ హస్పటల్ అక్కడి నుండి మెరుగైనా చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రవేట్ హాస్పటల్ కు తీసుకపోగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం చనిపోయాడు.
కొడుకు చనిపోయిన బాధతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడని భార్య పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపతి నరేష్ తెలిపారు. ఈ నెల 19 న మృతుని కొడుకు రమేష్ రెడ్డి మొదటి సంవత్సరికం ఉందని దానికి అన్ని ఎర్పాట్లు చేసుకున్నారని స్థానికులు తెలిపారు. ఇంతలో రాజీరెడ్డి మరణిచండంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.