MLA Dr Kalvakuntla Sanjay రాష్ట్రంలోని డొక్కు బస్సులను కోరుట్ల డిపోకు తరలిస్తున్నరు.. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
రాష్ట్రంలో ఉన్న డొక్కు బస్సులను అన్నింటిని మా కోరుట్ల నియోజవర్గంలోని డిపోలకే తరలిస్తున్నారని, ఆర్టీసీ అధికారులు వివక్ష దోరణి విడనాడాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు కేటాయించాల్సిన అధికారులు, ఉన్న బస్సులను ఇతర డిపోలకు తరలించడం బాధకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
- చాలీచాలని బస్సులతో ప్రజల ఇబ్బందులు
- కోరుట్ల కొత్త బస్టాండును పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్
- సరిపడా బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికుల ఆవేదన
MLA Dr Kalvakuntla Sanjay | కోరుట్ల, అక్టోబర్ 27 : రాష్ట్రంలో ఉన్న డొక్కు బస్సులను అన్నింటిని మా కోరుట్ల నియోజవర్గంలోని డిపోలకే తరలిస్తున్నారని, ఆర్టీసీ అధికారులు వివక్ష దోరణి విడనాడాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు కేటాయించాల్సిన అధికారులు, ఉన్న బస్సులను ఇతర డిపోలకు తరలించడం బాధకరమని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కోరుట్ల పట్టణంలోని కొత్త బస్టాండు ప్రయాణ ప్రాంగణాన్ని బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా బస్టాండులో ఉన్న ప్రయాణీలతో ఎమ్మెల్యే మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. బస్సులు సమయానికి రాక చాల ఇబ్బందులు పడుతున్నామని, రెండు గంటలు వేచి ఉన్న బస్సులు రావడం లేదని ప్రయాణీకులు ఎమ్మెల్యే ముందు తమ గోడు వెల్లబోసుకున్నారు. చాలీచాలనీ బస్సులతో కిక్కిరిసిన జనం మధ్యలో నానా అవస్థలు పడి ప్రయాణం చేయాల్సి వస్తుందని వాపోయారు. ప్రయాణీకుల సమస్యలను ఆలకించి ఆప్యాయంగా పలకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హమీ ఇచ్చారు.
బస్టాండులో ఉన్న తాగునీటి కులాయిలు, మరుగుదొడ్లను పరిశీలించిన ఎమ్మెల్యే పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. నిత్యం మూత్ర శాలలు, మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, వేసవిలో ప్రయాణీకులకు తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కోరుట్ల, మెట్పల్లి డిపోల నుంచి నిత్యం 70 వేల మంది ప్రయాణీకులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారన్నారు. రెండు డిపోలపై ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని, ఆదాయం వస్తున్న డొక్కు బస్సులు కేటాయించి, కొత్త బస్సులను ఇతర డిపోలకు తరలిస్తుందని ఆరోపించారు. కోరుట్ల నుంచి గతంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి, భద్రాచలం పుణ్య క్షేత్రానికి నడిపిన బస్సులను రద్దు చేయడం భావ్యం కాదన్నారు. లాభాసాటిగా ఉన్న రూట్లను విస్మరించి బస్సుల్లో కోత విధించడం మానుకోవాలని తెలిపారు. కోరుట్ల నుంచి వ్యాపారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హైద్రాబాద్ కు వెళుతుంటారని బస్సుల సంఖ్య పెంచాలన్నారు. జాతీయ రహదారులైన కరీంనగర్, నిజామాబాద్ రూట్లలో ప్రయాణీకుల రద్దీ అధికంగా ఉంటుందని ప్రయాణీకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అదనపు బస్సులు నడుపాలని ప్రభుత్వానికి ఆయన విన్నవించారు.
కోరుట్ల, మెట్పల్లి డిపోలకు కండీషన్లో ఉన్న బస్సులను ఆదనంగా కేటాయించాలని, ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులను ఆర్టీసీ రిజినల్ మేనేజర్ దృష్టికి ఎమ్మెల్యే తీసుకెళ్లారు. డిపో సందర్శనకు వస్తున్నామని ముందస్తూ సమాచారం ఇచ్చిన ప్రొటోకాల్ పాటించకుండా ఆలస్యంగా విధులకు హాజరైన కోరుట్ల డిపో మేనేజర్ మనోహర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్దతి మార్చుకోవాలని, సమయపాలన పాటించాలని, ప్రయాణీకుల సమస్యలపై దృష్టి సారించాలని చురకలంటించారు. వైద్య వృత్తిలో ఉన్న తనకు కత్తిని మంచికి, చెడుకు రెండింటికి వాడడం తెలుసని ఆర్టీసీ కార్మికులు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని మీ ఇబ్బందులను నిర్భయంగా తన దృష్టికి తీసుకురావాలని వాఖ్యలు చేశారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయకుండా చూసుకోవాలని ప్రయాణ ప్రాంగణంలోని దుకాణదారులకు సూచించారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచి విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, ప్రయాణీకులకు అసౌకర్యం కలుగకుండా మెరుగైన సేవలు అందించేందుకు ఆర్టీసీ అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ నాయకులు పహీమ్, మధు, శ్రీనివాస్, అతిక్, వినోద్ కుమార్, సురేందర్, మహేష్, రెహమాన్, అస్లాం తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Bus | ఫ్రీ బస్ వల్ల నా భార్య నన్ను వదిలేసి వెళ్లిపోయింది సార్.. ఎమ్మెల్యే కవ్వంపల్లితో కనకయ్య ఆవేదన
NRI | కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ ఆస్ట్రేలియా బృందం
Chandrayaan | వేణు ఊడుగుల సమర్పణలో కొత్త చిత్రం.. ఘనంగా ‘చంద్రయాన్’ రాకెట్ రివీల్ ఈవెంట్!
Breast Cancer | మహిళల్లో పెరుగుతున్న బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు.. లక్షణాలను ముందే గుర్తిస్తే చికిత్స సులభం..
Cyclone Arnab | గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. రేపు ఉదయం తీరాన్ని తాకే ఛాన్స్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

