Dubai | చిగురుమామిడి, మే 26 : చిగురుమామిడి మండలంలోని ఓగులాపూర్ గ్రామానికి చెందిన బూడిద చందు (22) నెల రోజుల క్రితం దుబాయ్‌కు బ్రతుకుతెరువు కోసం కూలి పనికి వెళ్లాడు. వారం రోజుల క్రితం తీవ్రమైన కడుపునొప్పి రావడంతో దుబాయిలోనీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి చెందాడు. వారం రోజుల అనంతరం మృతదేహం స్వగ్రామం ఓగులాపూర్‌కు సోమవారం రావడంతో కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి.
చేతికి అందిన కొడుకు విగత జీవిగా తిరిగి రావడంతో తల్లిదండ్రులు ఎల్లయ్య, కవితలు బోరున విలపించారు. ఎలాంటి ఆస్తిపాస్తులు, భూములు లేని చందు బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి నెల రోజుల్లోనే మృత్యువాత పడడం గ్రామస్తులను కలిచివేసింది. సోమవారం మృతుడు చందు అంతక్రియలు నిర్వహించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ సర్పంచ్ బోయిని శ్రీనివాస్, సీపీఐ మండల సహాయ కార్యదర్శి బూడిద సదాశివ ప్రభుత్వాన్ని కోరారు.
Rains | హైదరాబాద్‌కు నేడు నైరుతి.. ఎప్పుడైనా భారీ వర్షం కురిసే అవకాశం..!
Metuku Anand | కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు.. కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనం : మెతుకు ఆనంద్
US Visa | క్లాస్‌లు ఎగ్గొట్టినా వీసాలు రద్దు.. విదేశీ విద్యార్థులకు ట్రంప్ సర్కార్ కీలక హెచ్చరికలు