మంథని రూరల్, జూలై 27: ‘ఎక్లాస్పూర్ స్కూల్ అధ్వానం’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ లో శనివారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు తక్షణ చర్యలు చేపట్టి పాఠశాల ఆవరణలో బురద ఉన్న చోట్లలో చూర నింపారు. ఈ పనులను ఎంపీడీవో పూర్ణచందర్, ఏఈ అనుదీప్ దగ్గరుండి పర్యవేక్షించారు.
పిల్లలు తరగతి గదులకు రావడానికి బురద ఇబ్బందులు తొలగడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ఇటు ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఏఈ అనుదీప్ మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధి పనుల్లో భాగంగా కలెక్టర్ 10 లక్షల నిధులు మంజూరు చేయించారని, వర్షాల కారణంగా పనులు ప్రారంభం కావడం లేదని, తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.