Collector Koya Sriharsha | అధికారులు సమన్వయంతో పనిచేయాలి.. పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష
ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రామగిరి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల పనితీరును ఆయన సమీక్షించారు.
Collector Koya Sriharsha | రామగిరి, సెప్టెంబర్ 18 : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. రామగిరి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో వివిధ శాఖల పనితీరును ఆయన సమీక్షించారు. రామగిరి మండలంలో 12,467 ఎకరాల్లో పంటలు సాగు చేసిన నేపథ్యంలో రైతులకు వ్యవసాయ సేవలు సకాలంలో అందించాలని, ఎరువుల విక్రయాలను పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. 52.63 శాతం పూర్తైన డిజిటల్ క్రాప్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెంచడంతో పాటు ప్రీ-ప్రైమరీ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని, మైక్రో ఇరిగేషన్‌పై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామాల్లో తాగునీటి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పోషకాహారం సక్రమంగా అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేక అధికారి శ్రీనాథ్, డిప్యూటీ సీఈవో సంజీవరావు, డీఎల్పీవో కొమురయ్య, ఎంపీడీవో శైలజారాణి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ajinkya Shinde | సీజేపీ నిరసనల బాధ్యతలు అజింక్య షిండేకు.. ఆయన ఎవరంటే?
Shashi Tharoor | ఎమర్జెన్సీ కాదు.. ఇది ఎమర్ జెన్ జీ.. ఢిల్లీలో పోలీసుల దిగ్బంధనంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్
Mouth Cancer | నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోతే నోటి క్యాన్సర్ వస్తుందా.. ఇతర కారణాలు ఉన్నాయా..?
Assailant | దుండగుడు కూల్‌గా లేడీస్ హాస్టల్లోకి వెళ్లి ఏం చేశాడో తెలుసా..?
CJP Plan B | సీజేపీ ప్లాన్ ‘బి’.. జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అజింక్య షిండే నేతృత్వం
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

