గంగాధర, జూలై 14: గంగాధర మండలంలోని వివిధ గ్రామాల్లో 20 రోజుల క్రితం ట్రాన్స్ఫార్మ ర్లు కాలిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న విషయ మై ‘నమస్తే తెలంగాణ’లో ‘ట్రాన్స్ ఫార్మర్ల సమస్య పట్టదా?’ అనే శీర్షికన ప్రచు రితమైన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. మండలంలోని నాగిరెడ్డిపూర్, న్యాలకొండన్నపల్లి, వెంకంపల్లి గ్రామాల్లో కాలిపోయిన వాటి స్థానంలో కొత్తగా ట్రాన్స్ఫార్మర్లను బిగించినట్లు ఏడీ సత్యనారాయణ తెలిపారు. వానకాలం కావడంతో వివిధ కారణాలతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని, నిత్యం పర్యవేక్షణ చేస్తూ రైతులు ఇబ్బంది పడకుంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఏడీ తెలిపారు. సమస్యలు ఉంటే రైతులు తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.