 
                                                            Rajarampally | పెగడపల్లి, అక్టోబర్ 31 : పెగడపల్లి మండలం రాజరాంపల్లి గ్రామంలో భారీ వర్షాలకు నష్ట పోయిన పంటలను శుక్రవారం అధికారులు పరిశీలించారు. తహసీల్దార్ ఆనంద్ కుమార్, మండల వ్యవసాయ అధికారి శ్రీకాంత్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
అలాగే వర్షాలకు నేలకొరిగిన వరి పంటను పరిశీలించారు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని అధికారులు పేర్కొనగా, మంత్రి లక్ష్మణ్ కుమార్ సహకారంతో రైతులకు నష్టపరిహారం అందేలా చూడటంతో పాటు, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసేలా చూస్తామని ఏఎంసీ చైర్మన్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ శ్రీనివాస్, ఏఈవో అక్షయ్, మాజీ మార్కెట్ చైర్మన్ ఒరుగల శ్రీనివాస్, నాయకులు సంధి మల్లారెడ్డి, కిషన్, రైతులు పాల్గొన్నారు.
 
                            