సారంగాపూర్ : పంట పొలాలు నష్టపోతే దానికి అధికారులే బాధ్యుతలని (Officials Respons) మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) అన్నారు. మంగళవారం బీర్పూర్ మండలం చిన్న కొల్వాయి గ్రామంలోని లిఫ్ట్ ఇరిగేషన్‌ను ( Lift Irrigations ) పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. పంపుల్లో ఇరుక్కుపోయిన ఇసుకను తొలగిస్తే పంపులు ఆపరేట్ అవుతాయని వెంటనే మెకానిక్‌ను పిలిపించి సమస్యను పరిష్కరించాలని, లేదంటే సమస్య తలెత్తుతుందన్నారు.
మాజీ మంత్రి సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను వివరించారు. వెంటనే సమస్యను పరిష్కరించి రైతులకు నీటిని సరాఫరా చేయాలని సూచించారు. రోళ్లవాగు ప్రాజెక్ట్‌కు 0.25 టీఎంసీ లోపు గేట్లు త్వరగా అమర్చాలని అన్నారు. షటర్లు ఆర్డర్ పెట్టమని వచ్చాక అమర్చుతామని అధికారులు వివరించారు. కొల్వాయి గ్రామంలోని శెనగకుంటకు పైపు కనెక్షన్ కలపాలని అధికారులకు సూచించారు.
అనంతరం గోదావరి నీటి వరద ప్రవాహాన్ని పరిశీలించారు. రైతాంగానికి ప్రకృతి కూడ సహకరిస్తుందని, పంటలకు సాగు నీరు అందుతుందని, కాలం సహకరించడంతో పంటలు బాగా పండుతాయన్నారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మసరి రమేష్, మాజీ వైస్ ఎంపీపీ బల్మురి లక్ష్మణ్ రావు, సింగిల్ విండో చైర్మన్ పాలుసాని నవీన్ రావు, పార్టీ మండల అధ్యక్షులు చెరుపూరి సుభాష్, మాజీ జడ్పీటీసీ ముక్క శంకర్, శేఖర్, నర్సయ్య, నాయకులు , తదితరులు పాల్గొన్నారు.