సుల్తానాబాద్ రూరల్, జులై 29 : గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయంలో మంగళవారం నాగుల పంచమిని పురస్కరించుకొని ఓడి బియ్యంతో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గౌడ కులస్తులు గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రావణ మాసంలో పెద్ద సంఖ్యలో ఇంటికి ఓ బోనంతో మహిళలు బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పోచమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ తల్లి అమ్మవార్లకు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. అమ్మవారికి పోసిన ఓడి బియ్యంతో నైవేద్యం సమర్పించి తిరుగు వారం నిర్వహించారు. ఎల్లమ్మ తల్లికి ప్రసాదం సమర్పించిన అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నేతలు జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు అంతటి అన్నయ్య గౌడ్, గౌడ కులస్తులు పుష్పలత, మంద శ్రీనివాస్ గౌడ్, గడ్డం అంజయ్య గౌడ్, పొన్నం తిరుపతి గౌడ్, కొయ్యడ శ్రీనివాస్ గౌడ్, కెక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, కొయ్యడ రమేష్ గౌడ్, కరుణాకర్ గౌడ్, మంద శివ గౌడ్, బత్తిని కృష్ణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్తోపాటు తదితరులు పాల్గొన్నారు