MP Vamsi Krishna | ఓదెల, ఫిబ్రవరి 9: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని ఓదెల, కొలనూర్, పొత్కపల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్లను హాల్టింగ్ చేయించాలని ఎంపీ వంశీకృష్ణకు ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేసినట్లు ఓదెల గ్రామానికి చెందిన అల్లం సతీష్ తెలిపారు. న్యూఢిల్లీలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణని తన నివాసంలో సోమవారం కలిసి ఓదెల రైల్వే స్టేషన్లో కరీంనగర్ టూ తిరుపతి, అండమాన్ రైళ్లను హాల్టింగ్ చేయించాలని కోరారు.
అలాగే పొత్కపల్లి, కొలనూరు రైల్వే స్టేషన్ అజ్ని రైలు హాల్టింగ్, అజ్ని రైలు కాజీపేట నుంచి సికింద్రాబాద్ వరకు పొడగింపు కోసం వినతి పత్రం ఇచ్చినట్లు సతీష్ తెలిపారు. ఇందుకు స్పందించిన ఎంపీ ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రైల్వే శాఖ మంత్రిని కలిసి ఓదెల మండలంలో రైళ్ల హాల్టింగ్ గురించి వివరిస్తానని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.