చిగురుమామిడి,ఫిబ్రవరి 5 : వరంగల్ బీసీ సభలో వివిధ ప్రసారమాధ్యమాల్లో ఓసీ సామాజిక వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని ఓసీ సంఘ నాయకులు(OC association leaders )డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో వారు విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్న సందర్భంలో కులాల మధ్య చిచ్చుపెట్టి అశాంతి నెలకొల్పుతున్న తీన్మార్ మల్లన్న బహిరంగ క్షమాపణ చెప్పాలని, పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
అనంతరం ఓసీ సంఘం నాయకులు పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంగ రమణారెడ్డి, చిట్టిమల్ల రవీందర్, చిట్టిమల్ల శ్రీనివాస్, కాటం సంపత్ రెడ్డి, గంగు నాగేంద్ర శర్మ, పోటు మల్లారెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రాజిరెడ్డి, సురేందర్ రెడ్డి, అంజిరెడ్డి, మధుసూదన్ రెడ్డి తదితరులున్నారు.