NTPC | జ్యోతినగర్, డిసెంబర్ 25: ఎన్టీపీసీ సంస్థ నైతిక ప్రమాణాలను సమీక్షించడానికి ఢిల్లీ నుంచి విచ్చేసిన ఎన్టీపీసీ స్వంతంత్ర డైరెక్టర్లు గురువారం రామగుండం ఎన్టీపీసీ పర్యటనకు విచ్చేశారు. ఎన్టీపీసీ టౌన్షిప్ లో ని వీఐపీ గెస్ట్ హౌజ్ చేరుకున్న డైరెక్టర్లు అనంతరం 100మెగావాట్ల ప్లోటింగ్ సోలార్ ప్లాంటును సందర్శించారు. బోటింగ్ లో రిజర్వాయర్లో ప్లాంటును పరిశీలించారు.
అక్కడి నుంచి 2600మెగావాట్ల రామగుండం ఎన్టీపీసీకి వెళ్లిన డైరెక్టర్లు ప్లాంటులోని 500మెగావాట్ల యూనిట్ 7, తెలంగాణ ప్రాజెక్టును సందర్శించారు. అలాగే హెరిటేజ్ సెంటర్ సందర్శనతో ప్లాంటు కార్యాచరణ సామర్ధ్యం, భద్రతా ప్రమాణాలు, పర్యావరణంను సమీక్షించారు. అనంతరం టౌన్ షిప్ లో ఆయుశ్ వాటికలో చెపట్టిన చెట్ల పెంపకంను సందర్శించారు. పర్యటించిన వారిలో ఎన్టీపీసీ స్వతంత్ర డైరెక్టర్లు అనిల్ కుమార్ త్రిగుణాయత్, డాక్టర్ అనిల్ కుమార్ గుప్తా, సీఏ పంకజ్ గుప్తా, డాక్టర్ కే గాయత్రిదేవి, సుశీల్ కుమార్ చౌదరి ఉన్నారు.