ACB Notices | రాజకీయ కక్షతోనే కేటీఆర్ కు నోటీసులు..కేటీఆర్ కు నోటీసులపై బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆగ్రహం
ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఫార్ములా- ఈ రేస్ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసిబి నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు.
ACB Notices | సిరిసిల్ల టౌన్, జూన్ 14: ప్రజా సమస్యలపై నిరంతరం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారని ఫార్ములా- ఈ రేస్ కేసులో ప్రభుత్వం రాజకీయ కక్షతోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏసిబి నోటీసులు ఇచ్చిందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. పాలన చేతగాని రేవంత్‌రెడ్డిని ప్రజా క్షేత్రంలోకి వెళ్తే ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, దీని నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకే డైవర్షన్ పాలిటిక్కు తెరలేపిండని ఆరోపించారు.
జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దమ్ముంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్ టెస్టుకు రావాలని కేటీఆర్ సవాల్ విసిరారని గుర్తుచేశారు. కేటీఆర్ సవాల్‌ను స్వీకరించి రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ పరీక్షకు హాజరై తన పవిత్రతను చాటుకోవాలని డిమాండ్ చేశారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పదేండ్లు అవుతుందన్నారు.
ఫార్ములా కారు రెస్ తో తెలంగాణ ప్రతిష్ట పెరిగిందని, తెలంగాణకు పెట్టుబడులు వచ్చాయన్నారు. రాజకీయంగా కేటీఆర్ ను ఎదుర్కొనలేని ప్రభుత్వం ఎసిబి నోటీసుల పేరుతో ఇబ్బందులు పెట్టాలని చూస్తుందన్నారు. పాలకుర్తి, మహబూబాబాద్ ప్రాంతాల్లో ప్రజలు హామీల అమలుపై ఎమ్మెల్యేలను తరిమికొడుతున్నారని ఎద్దేవ చేశారు. ప్రజా క్షేత్రంలో ఎక్కడికి వెళ్లిన కాంగ్రెస్ నేతలను ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. గతంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో వ్యవసాయ పనులకు వెన్నుదన్నుగా నిలిచారని కొనియాడారు. రైతు బీమా ద్వారా రైతు కుటుంబాలకు అండగా ఉన్నారని, కాగా ప్రస్తుతం రేవంత్ రెడ్డి సదరు బీమా కంపెనీకి డబ్బులు చెల్లించకపోవడంతో రైతు బీమా పథకం అయోమయంగా మారిపోయిందన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీమేరకు సన్నాలకు బోనస్ వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. 10వ తరగతి చదవిన విద్యార్థులకు రూ. 10వేలు, ఇంటర్ పూర్తిచేసిన వారికి రూ.15వేలు, డిగ్రీ పాసైన వారికి రూ.25వేలు, పీహెచ్ డి పూర్తైన వాళ్లకు రూ.లక్ష వరకు ఇస్తామన్న హామీని వెంటనే అమలు చేయాలన్నారు. రైతులు, ప్రజలు, విద్యార్థులందరి నుండి వస్తున్న వ్యతిరేఖత నుండి తప్పించుకునేందుకు ఏసీబీ నోటీసుల పేరుతో కొత్త డ్రామాకు తెరలేపిండన్నారు. ఈ సమావేశంలో న్యాలకొండ రాఘవరెడ్డి, బండ నర్సయ్య యాదవ్, కుంబాల మల్లారెడ్డి, గుండారపు కృష్ణారెడ్డి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, దిడి రాజు, దార సందీప్. రికుమల్లె సంపత్, పోరండ్ల రమేష్, కొయ్యాడ రమేష్ గౌడ్, జవహర్ రెడ్డి, అమర్ రావు, గుండు ప్రేమ్ కుమార్, బూర తిరుపతి, తదితర నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
- Tags
- BRS
- KTR
- notices
- political factions
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

