Vemulawada | వేములవాడ, జనవరి 29: వేములవాడ పురపాలక సంఘంలో జరుగుతున్న ఎన్నికలలో భాగంగా అభ్యర్థులకు అవసరమయ్యే ఓటర్ జాబితా సమాచారాన్ని అధికారులు గేటు కే తగిలించారు. కార్యాలయంలోకి నామినేషన్ వేసే అభ్యర్థులు మినహా కూడా ఎవరికి కూడా అనుమతి లేకపోవడం పురపాలక సంఘం కార్యాలయం గేటు వద్ద ఏర్పాటుచేసిన నోటీసులను చూసుకోవలసిన పరిస్థితి ఉంది.
మరోవైపు పోలీసులు కూడా అక్కడే బందోబస్తు నిర్వహిస్తుండగా ఆంక్షలు పర్వం కూడా కొనసాగుతోంది. ఇద్దరికన్నా ఎక్కువ ఎవరైనా కనిపిస్తే అక్కడి నుంచి వెళ్లాలని ఆదేశిస్తూ ఉండడంతో మున్సిపల్ కార్యాలయ గేట్ కు ఏర్పాటు చేసిన నోటీసులను చూసుకోనేందుకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.