కరీంనగర్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : తొలి విడుత పంచాయతీ ఎన్నికల్లో రెండో రోజయిన శుక్రవారం పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 92 సర్పంచ్ స్థానాలకు గానూ ఈ రోజు 197 నామినేషన్లు వచ్చాయి. మొదటి రోజు 92 కలుపుకొని రెండు రోజుల్లో 289 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాలోని 866 వార్డు స్థానాలకు మొదటి రోజు కేవలం 86 నామినేషన్లు మాత్రమేరాగా, రెండో రోజు 543 దాఖలవగా రెండు రోజుల్లో 629 వచ్చాయి. కాగా, తొలి విడుత నామినేషన్లకు శనివారం ఆఖరు రోజు. ఆదివారం రెండో విడుత పంచాయతీ ఎన్నికలకు ఆయా మండలాల్లో నోటిఫికేషన్ విడుదల చేసి నామినేషన్లు స్వీకరిస్తారు.
గంగాధర, నవంబర్ 28: గంగాధర మండలంలోని కురిక్యాల, గంగాధర నామినేషన్ స్వీకరణ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడు చంద్రశేఖర్రెడ్డి శుక్రవారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో నామినేషన్ల తీరును పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు.