Veenavanka | వీణవంక, ఏప్రిల్ 4: రేషన్ కార్డులు ఇవ్వలేదు బియ్యం ఎలా ఇస్తారో చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకుడు రాపర్తి అఖిల్ గౌడ్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో ఆయన శుక్రవారం మాట్లాడుతూ రేషన్ కార్డులు ఇవ్వడం చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రజాపాలన పేరుతో నాలుగుసార్లు దరఖాస్తులు తీసుకొని ప్రజలను మోసం చేసిందని, అదే ధోరణి ఇంకా కొనసాగిస్తోందని మండిపడ్డారు. మార్చి 31 వరకు రైతు భరోసా మొత్తం ఇస్తానని మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.